వరద బాదితుల సమస్యలు తెలుసుకున్న ఆర్డిఓ
1 min readకె. అద్దయ్య, డ్వామా పిడి ఎ. రాము
బోట్లలో పునరావాస కేంద్రాలను సందర్శన
నిత్యవసర సరుకులు అందించాలని అధికారులకు ఆదేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: వేలేరుపాడు మండలంలో తూర్పుమెట్ట, నార్లవరం,తిరుమలాపురం, గ్రామాలను బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె. అద్దయ్య, డ్వామా పిడి ఎ. రాము, తహశీల్దారు డివి సత్యనారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో తూర్పుమెట్ట గ్రామంలోని పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన జనరేటరు పనిచేయకపోవడంతో దాని స్ధానంలో వేరే జనరేటరును యుద్ధప్రాతిపధికన ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే గ్రామాల్లో 25 కేజీల బియ్యం, కాయగూరలను పంపిణీ చేయాలని అధికారులకు ఆర్డివో అద్దయ్య ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పరిస్ధితులను పరిశీలించారు. గోదావరి నది తగ్గుముఖం పడుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను పాటించాలని గ్రామ ప్రజలను కోరారు.