PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోలార్ భూములను పరిశీలించిన ఆర్డిఓ..

1 min read

మీ ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తారా..

పైపాలెంలో సోలార్ పనులపై భగ్గుమంటున్న రైతులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): రెవెన్యూ అధికారులు మీరు మీరే కాబట్టి మీ ఇష్టానుసారంగా సోలార్ కు ఏ విధంగా ప్రపోజల్స్ పంపిస్తారని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. శనివారం ఆత్మకూరు నూతన ఆర్డీవో దాసిరెడ్డి నాగజ్యోతి మిడుతూరు మండలంలో పర్యటించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పైపాలెం,నాగలూటి,మాసపేట పొలిమేరలో సోలార్ ప్రాజెక్టుకు -1011 ఎకరాలకు గతంలోనే ప్రపోజల్ పంపడంతో అనుమతులు మంజూరయ్యాయి.అది కాకుండా ఇంకా 500 ఎకరాలు కావాలని సోలార్ అధికారులు జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శనివారం నాగలూటి సచివాలయంలో పై పాలెం గ్రామంలో ఇంకా ప్రభుత్వ భూమి ఎంత ఉందనే వాటి గురించి గ్రామ మ్యాప్ ను మండల సర్వేయర్ కృష్ణుడు ను అడిగి తెలుసుకున్నారు.ఈ 500 ఎకరాలపై నివేదికను కలెక్టర్ కు రెవెన్యూ అధికారులు పంపనున్నారు.సోలార్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఆర్డీవో పరిశీలించారు.మా గ్రామంలో గ్రామసభ ఆమోదం లేకుండా ఏ విధంగా పనులు ప్రారంభిస్తారు వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల ఆమోదం తెలుసుకోవాలని గ్రామ పెద్దలు జగన్ మోహన్ రెడ్డి,రామలింగేశ్వర రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు ఆర్డీవోను కోరారు.పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆర్డీవో వారికి సూచించారు.మా గ్రామంలో 750 ఎకరాలు సోలార్ కు తీసుకున్నారని వీటిలో 250 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని గ్రామ పెద్దలు కోరారు.సోలార్ రద్దు గురించి డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్,కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని జగన్మోహన్ రెడ్డి రామలింగేశ్వర్ రెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని కాపాడండి అని జస్టిస్ చంద్ర చూడ్ అంటున్నారు కానీ ఇక్కడ అధికారులు పర్యావరణాన్ని కాపాడుతున్నారా అని వారు ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, ఆర్డీవో కార్యాలయ డీటీ షాన్వాజ్,సర్వే ఉప తనిఖీ దారుడు కే.ఉమాపతి,వీఆర్వో సుందరాజు,గ్రామస్తులు జయరామిరెడ్డి,వెంకటయ్య, వెంకటేశ్వర్లు,ఇనాయతుల్ల, శేఖర్,మర్రి రామేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

About Author