పకడ్బందీగా భూముల రీ సర్వే
1 min readఆర్డిఓ జాన్ లెర్వీన్ పాలపర్తి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులకు సంబంధించిన భూ పూరి సర్వే పకడ్బందీగా చేపడుతున్నట్లు ఆర్డిఓ జాన్ లెర్విన్ పాలపర్తి అన్నారు. మండలంలోని శివాల పల్లి గ్రామపంచాయతీలో సోమవారం పైలెట్ ప్రాజెక్టు కింద భూ రీ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్టు ఆంధ్ర భూ రీసర్వే ద్వారా శివాల పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 897.65 ఎకరాల రైతులకు సంబంధించిన భూములను రీ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రీసర్వే ద్వారా భూములకు సంబంధించిన ఎలాంటి వివాదాలు లేకుండా, రైతులకు భూ సర్వే నిర్వహించి వారి వారి భూములకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడం జరుగుతుందన్నారు. గతంలో భూముల వద్ద గట్ల మధ్య సమస్య ఉండడంతో రైతులు రెవిన్యూ అధికారుల వద్దకు వచ్చి పరిష్కరించుకునే వారని అలాంటిది ప్రభుత్వమే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరించబడుతుందని ఆయన తెలిపారు. ఈ రీ సర్వే డ్రోన్ల ద్వారా జిల్లా సర్వేయర్ కే మురళీకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతుందని రైతులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ద్వారా రైతులకు తెలియజేసిన తేదీలలో వారికి సంబంధించిన భూమికి సంబంధించిన రికార్డులను తీసుకొని హాజరుకావాలని ఆయన రైతులకు తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సరస్వతి డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, మండల సర్వేయర్ సోమశేఖర్. గ్రామ సర్వేయర్లు ఆరిఫ్, శివారెడ్డి, జాకీర్ హుస్సేన్, జితేంద్ర రెడ్డి, ఈశ్వరయ్య రామచంద్రారెడ్డి, సుస్మిత, సుమలత రైతులు పాల్గొన్నారు.