ప్రారంభమైన రీ సర్వే….
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని తమ్మడపల్లె గ్రామ పంట పొలాల్లో రీ సర్వే తహసిల్దార్ రమాదేవి, బన్నూరు రామలింగారెడ్డి ప్రారంభించారు. రీ సర్వేలో భాగంగా రైతుల సమక్షంలోనే కొలతలు వేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని తాహసిల్దార్ రమాదేవి పేర్కొన్నారు. రైతులు సహకరించాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించి సమస్య పరిష్కరించుకోవడానికి ఇది మంచి సువర్ణ అవకాశం అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కామేశ్వర్ రెడ్డి జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి మండల సర్వేర్ భాష తమ్మడపల్లె మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు ఉల్లి మధు పలువురు వీఆర్వోలు గ్రామ సర్వేయర్లు మరియు రైతులు పాల్గొన్నారు,