PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి 

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీలోని శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును ప్రధానం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విశిష్ట సేవలు అందించి తన ఉద్యోగానికి రాజీనామా చేసి తనలాగే ఎంతోమంది విద్యార్థులను బ్యాంకింగ్ రంగంలో చూడాలన్న లక్ష్యంతో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ను స్థాపించిన ఆయన సుమారు 42,500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తాను పుట్టిన స్వగ్రామమైన సంజామల మండలం మంగపల్లి గ్రామంలో పేద ప్రజల కోసం తన తండ్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం తన తండ్రి అందించిన 10 ఎకరాల స్థలంలో ఉచితంగా  ఆసుపత్రిని స్థాపించి స్థానిక ప్రజల కోసం ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. తన సొంత ఖర్చులతో అత్యవసర ప్రమాద స్థితిలో ఉన్న రోగుల కోసం ఉచితంగా అంబులెన్స్ను నిర్వహిస్తున్న మహోన్నతుడు. డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి గారు. ఇంతటి సేవా గుణాన్ని కలిగిన వ్యక్తికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవో కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక బృందావనం ఆడిటోరియంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డును అందించారు. సమగ్రత, స్ఫూర్తికి చిహ్నంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత డాక్టర్ ఎ.ఎస్. వసుధా రాణి  ముఖ్యఅతిథిగా హాజరై అవార్డును ప్రధానం చేశారు .ఈ కార్యక్రమానికి అతిథులుగా శ డాక్టర్ రామకృష్ణ రెడ్డి ,  ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్, ఇంటాచ్ కన్వీనర్ ఎం.వి. శివ కుమార్ రెడ్డి, టీచర్స్ యూనియన్ కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఒంటేరి శ్రీనివాసుల రెడ్డి, స్టేట్ ఐఎంఏ ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ వసుధా రాణి మాట్లాడుతూ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని తాను అందించిన సేవలకు గుర్తుగా విశిష్టమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డును అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. . ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వివిధ బ్యాంకుల్లో స్థిరపడేలా చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్లు మౌలాలి రెడ్డి షేక్షావలి రెడ్డి, అతిధులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు  శ్రీ  రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన బ్యాంకు ఉద్యోగులు,  పట్టణ ప్రముఖులు , స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *