PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కళామతల్లి సేవలకు గుర్తింపు, కళాకారులకు ఆత్మీయ సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రపుశాల అంకయ్య అధ్యక్షతన కర్నూలు నగరం ఉందని మద్దూర్ నగర్ లో గల సూరన్న తోట నందు ఈరోజు ఉదయం, ఎన్టీఆర్ జాతీయ పురస్కార గ్రహీతలు పెనికలపాటి హనుమంతరావు చౌదరి, బైలుప్పల షఫీయుల్లా, మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ లింకా అవార్డు గ్రహీత డాక్టర్ కే ఎన్ అరుణకుమారి, కళామతల్లి సేవలను గుర్తించి ఆత్మీయ పురస్కారం టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సమాజ సేవకులు డాక్టర్ జి ఎస్ ఎం సుభాన్, జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, రంగస్థల పురస్కార గ్రహీతలకు ఘనంగా సత్కరించడం జరిగింది. కళాకారులు కళామతల్లి సేవలో నిరంతరం కృషి చేయాలని కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు తమ ప్రతిభను జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని, సందేశాత్మక పాత్రలను పోషిస్తూ భారత భాగవత రామాయణంలోని ప్రధాన ఘట్టాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం కళాకారులకు ఉందని ముఖ్య అతిధులు పత్తి ఓబులయ్య సిహెచ్ చంద్రన్న పి దస్తగిరి సయ్యద్ రోషన్ అలీ కళాప్రియ తిరుపాలు కళాకారులను అభినందిస్తూ, సమాజంలోని మార్పుకు శ్రీకారం నాంది పలకాలని రంగస్థలం దర్శకులు వివి రమణారెడ్డి మనోహర్ బాబు కళాకారులకు సూచనలు ఇచ్చారు. ఎన్టీఆర్ జాతీయ పురస్కార గ్రహీతలు పి హనుమంతరావు చౌదరి, బై లుప్పల షఫీయుల్లా డాక్టర్ కేఎన్ అరుణకుమారి సేవలను గుర్తించి, కళావాహిని సాహితి సంస్థ, శ్రీశైల భ్రమరాంబిక కళా సమితి, విశ్వ కళా సమితి, కర్నూలు కళాకారులు ఆత్మీయ అభినందనలను తెలిపారు, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కర్నూలు జిల్లా అధ్యక్షులు గుర్రపుశాల అంకయ్య, సిహెచ్ చంద్రన్న పి దస్తగిరి, కళాప్రియ తిరుపాలు, సిబి అజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, శేఖర్, కవి పార్వతయ్య, డి పుల్లయ్య, డిఎన్వి సుబ్బయ్య, గోవిందరాజులు, ఎన్డీ కృష్ణ ఫర్, వివి రమణాచారి, రాజశేఖర్, శ్రీనివాసరావు, ఆనందరావు, గాండ్ల లక్ష్మన్న, ముంతాజ్ రంగస్థల కళాకారులు పాల్గొని కళాకారులకు సన్మానించి అభినందనలు తెలియజేశారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులకు ఒక ప్రత్యేక వేదిక కావాలని చెప్పి కళాకారులు సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేశారు.

About Author