ఎర్ర మట్టి… ఇసుక అక్రమ రవాణా దారులను వదలవద్దు…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ఎర్ర మట్టి మరియు ఇసుక అక్రమ రవాణా దారులను వదల వద్దని నంద్యాల జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. మహానంది, సిరివెళ్ల మండలాల సరిహద్దుల్లో ఎర్ర మట్టి మరియు ఇతర మండలాల్లోని పలు చోట్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పలుచోట్ల గస్తీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. రాత్రి ,పగలు లేకుండా రహస్యంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎంతటి వారినైనా వదల వద్దని ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమకు తెలియజేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో గస్తీ ముమ్మరం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పోలీస్ బాస్ కు అందజేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీశైలం నియోజకవర్గం లోని మహానంది మండలం మరియు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సిరివెళ్ల, రుద్రవరం ఇతర మండలాలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. నిఘవర్గాలు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.