ఖరీఫ్ సీజన్ గాను పంటల నమోదు తప్పనిసరి
1 min readమండలం వ్యవసాయ అధికారి. కే శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఖరీఫ్ సీజన్2024 సంవత్సరం గాను పంటల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని మండలం వ్యవసాయ అధికారి. కే శ్రీదేవి తెలిపారు, పంట వేసిన రైతులందరూ ఈ- పంట ద్వారా ఆయా పంటలను నమో చేసుకోవాలనిఆమె రైతులకు సూచించారు.దీని కొరకు మీ గ్రామం పరిధిలో రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని ఆమె తెలియజేశారు, మినుము పంట వేసిన రైతులు పంట 45- 50 రోజుల వయసులో ఉన్నందున త్వరితిగతిన పంట నమోదు చేసుకోగలరని తెలిపారు, మండలంలో ముండ్ల పల్లి, శివాలపల్లి, రామనపల్లి, రాచినాయపల్లి. దుగ్గనపల్లి,రెవెన్యూ గ్రామాల రైతులు మినుము పంటను నమో చేసుకోవాలన్నారు, పంట నమోదు చేసుకోవడం వలన రైతులు పంట నష్టం. పరిహారం, అలాగే సున్నా వడ్డీ, వంటి పంట రుణాలు పొందవచ్చని తెలిపారు, కావున రైతులు దగ్గర్లో ఉన్న రైతు సేవ కేంద్రాల్లో ఆధార్ కార్డు ,పట్టాదారుపాస్ పుస్తకం తీసుకెళ్లి ఏఈఓ లను సంప్రదించాలని ఆమె రైతులను కోరారు.