PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు తీసుకోవలసిన చర్యల పై ఆరా తీసిన… జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు  తీసుకోవలసిన చర్యల పై కర్నూలులోని  ఆయా కళాశాలలు మరియు  పాఠశాలల యాజమాన్యాలతో కలిసి సమావేశం నిర్వహించి చర్చించి పలు సూచనలు చేశారు.కళాశాలలు, పాఠశాలల బస్సులలో  విద్యార్ధులను ఎక్కించెటప్పుడు, దించెటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు   తీసుకోవలసిన జాగ్రత్త ల పై పలు సూచనలు, సలహాలు చేశారు.  ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడుతూ..ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు పాఠశాలలు, కళాశాలల యజామాన్యాలు స్కూల్ మరియు కళాశాల పని  వేళలలో  కళాశాలలు,  పాఠశాలల వద్ద  ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా యాజామన్యాలే వారి సెక్యూరిటి చేత  సెల్ఫ్ ట్రాఫిక్ కంట్రోల్  చేయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  బైక్ రైడింగ్,  బైక్ సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దం చేస్తూ వెళ్తున్న వ్యక్తుల, యువకుల విడియోలు తీసి ప్రజలు  పోలీసు అధికారులకు గాని, జిల్లా ఎస్పీకి గాని లేదా కర్నూలు పోలీసు  వాట్సప్  నెంబర్ 7777877722 కు గాని పంపించాలన్నారు.  అధిక శబ్దం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పై   పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు.అదే విధంగా పట్టణంలోని బైక్ మెకానిక్ లు  అధిక శబ్దం చేసే  బైక్  సైలెన్సర్లు బిగించవద్దని, బిగించిన యెడల బైక్ మెకానిక్ ల పై చర్యలు తీసుకుంటామన్నారు.  ర్యాగింగ్‌, ఈవ్ టీజింగ్ ,  ఆకతాయిల నుండి ఎదురయ్యే సమస్యల గురించి కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు జిల్లా ఎస్పీ కి  విన్నవించారు. ఈ విషయం పై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి,  ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసే  ఆకతాయిల పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ శ్రీ జె.బాబు ప్రసాద్,  కర్నూలు  రెండవ పట్టణ సిఐ నాగరాజా రావు , కర్నూలు లోని  14  ప్రవేట్ మరియు కార్పోరెట్ కళాశాలలు, పాఠశాలల  యాజమాన్యాలు పాల్గొన్నారు.

About Author