PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల నామినేషన్ పత్రాలలో 7 నామినేషన్ల తిరస్కరణ

1 min read

కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/ జిల్లా కలెక్టర్ డా జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు పార్లమెంట్ -18 నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాలలో 7 నామినేషన్లను తిరస్కరించడం జరిగిందని కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/ జిల్లా కలెక్టర్ డా జి.సృజన తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో  కర్నూలు పార్లమెంట్ -18 నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్ల సమక్షంలో నామినేషన్ పత్రాల స్క్రూటినీ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన  నిర్వహించారు.ఈ సందర్భంగా  కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/ జిల్లా కలెక్టర్ డా జి.సృజన మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ -18 నియోజకవర్గ ఎన్నికలకు 27 మంది అభ్యర్థులు 41 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారని, ఎలక్షన్ కమీషన్ వారి మార్గదర్శకాలు, సూచనల ప్రకారం ప్రతి ఒక సెట్ ను స్క్రూటినీ చేసి వెరిఫై చేయడం జరిగిందన్నారు. వాటి వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

నామినేషన్లు తిరస్కరించిన అభ్యర్థుల వివరాలు

 1) జయసుధ, తెలుగు దేశం పార్టీ

2) శంకర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి

3) కోడిపుంజుల పద్మ,  స్వతంత్ర అభ్యర్థి

4) వర ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి

5) సయ్యద్  ముర్షాద్ పీర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

6) నాగేంద్రుడు, తెలుగు రాజాధికార సమితి పార్టీ

7) అమీర్ మావ్య, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.

 నామినేషన్లు సక్రమముగా ఉన్న అభ్యర్థుల వివరాలు

1) బస్తిపాటి నాగరాజు, టిడిపి పార్టీ.

2) బి.వై.రామయ్య, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

     (వైఎస్ఆర్సిపి).

3) టి.బీచుపల్లి, స్వతంత్ర అభ్యర్థి

4) మల్లెపోగు నాగన్న, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)

5) వడ్డే ఉరుకుందు, స్వతంత్ర అభ్యర్థి

6) రాజబాబు, అల్ పీపుల్స్ పార్టీ

7) షేక్ జహంగీర్ అహ్మద్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.

8) రామపుల్లయ్య యాదవ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC).

9) కోదండ, స్వతంత్ర అభ్యర్థి

10) సల్కాపురం అమృత కుమార్, లిబర్షన్ కాంగ్రెస్ పార్టీ.

11) విజయభాస్కర్ రెడ్డిపోగు, స్వతంత్ర అభ్యర్థి

12) వాల్మీకి అర్జున్, భారత చైతన్య యువజన పార్టీ.

13)  అబ్దుల్ సత్తార్, అన్న వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ.

14)  మంచాల లక్ష్మీ నారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP)

15) సుంకర శ్రీధర్, జై భారత్ నేషనల్ పార్టీ.

16) రెడ్డిపోగు ప్రవీణ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి.

17) సయ్యద్ నవీద్, స్వతంత్ర అభ్యర్థి

18) ప్రకాష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి

19) దేవర పోగు మదిలేటి, స్వతంత్ర అభ్యర్థి

20) బోయ సురేష్, స్వతంత్ర అభ్యర్థి

కార్యక్రమంలో  కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జాఫర్, పత్తికొండ, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మీర్ తారీఖ్ ఆలీ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదన రావు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author