కరెంట్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సిపి పోరుబాట కరపత్రం విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు బుట్టా శివ నీలకంఠ ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి/వైయస్ఆర్ సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల్లో పెంచిన కరెంట్ చార్జీల బాదుడుపై ఎలక్షన్ ముందు పెంచను అని హామీ ఇచ్చి మాట మార్చిన కూటమి ప్రభుత్వం మీద పోరుబాటకు సిద్ధం కావాలని వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు బుట్టా శివ నీలకంఠ గారు, పార్టీ అనుబంధ విభాగాల వీర శైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడు వై రుద్ర గౌడ్ ,బి.ఆర్ బసిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రోజున స్థానిక పార్టీ కార్యాలయం నందు 27వ తేదిన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న కరెంట్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సిపి పోరుబాట కరపత్రాలను విడుదల చేశారు.27 న జరిగే పోరుబాట కార్యక్రమానికి వైయస్ఆర్ సిపి శ్రేణులు, రైతులు కలిసి వచ్చి పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,కామర్తి నాగేశప్ప, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్,జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు యం.కె శివప్రసాద్,ముగతి విరుపాక్షి రెడ్డి, మాచాని వెంకటేష్,నాగేష్ నాయుడు,మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, కోటేకల్ లక్ష్మన్న ,వార్డ్ ఇంచార్జ్ లు, సర్పంచులు,ఎంపీటీసీలు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.