PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెఎస్డబ్ల్యు ఆధ్వర్యంలో ముళ్ళకంప చెట్లు తొలగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండలంలోని బిలకల గూడూరు గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లే రస్తాలో చెట్ల పొదలు అధికంగా ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండడంతో బిలకలగూడూరు టిడిపి నాయకులు సుదర్శన్ రెడ్డి జిందాల్ యాజమాన్యానికి తెలుపగా, సి ఎస్ ఆర్ నిధుల నుండి జెసిబి సహాయంతో గుబురుగా ఉన్న ముళ్లపొదలను తొలగించారు. మంగళవారం బిలకల గూడూరు గ్రామం నుండి గడివేముల రస్తా, బూజనూరు రస్తా, జిందాల్ వెళ్లే రహదారి లలో  జెసిబి తో తొలగించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని నెలల నుండి రోడ్డుకిరువైపులా కంపచెట్లు అధికంగా ఉన్న బిలకల గూడూరు సర్పంచ్, వైసిపి నాయకులు పట్టించుకోలేదని, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జెఎస్డబ్ల్యు వారి సహాయంతో కంపచెట్లను తొలగించామని, జెఎస్డబ్ల్యు కంపెనీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెఎస్డబ్ల్యు సిఎస్ఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .

About Author