ఎమ్మెల్యే చొరవతో బుడ్డాయిపల్లి ఉపకాలవ తూము గేటుకు మరమ్మతులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట నుంచి కడప మెయిన్ కేసీ కెనాల్ కు సంబంధించి శివాలపల్లి గ్రామ సమీపంలో బుడ్డాయిపల్లి కేసీ కెనాల్ ఉప కాలువకు సాగునీరు అందించే తుము గేటు తోపాటు గేటు ఇరవైపుల దిమ్మెలు దెబ్బతినడం జరిగింది, ఈ విషయాన్ని బుడ్డాయిపల్లి చెన్నూరు గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంపై వెంటనే ఎమ్మెల్యే స్పందించి కేసీ కెనాల్ డిఈ, ఏ ఈ లతో మాట్లాడడం జరిగింది, బుడ్డయిపల్లి కేసి ఉపకాలవ కింద 500 ఎకరాలకు పైగా రైతులువరిసాగు చేయనన్నారు,ఉప కాలువ దెబ్బతిన్నడంతో నీరంతా వృధాగా పోతుందన్న ఉద్దేశంతో రైతులు కాలవ గేటు బిగించాలని కోరడం ఆయన వెంటనే స్పందించి కేసీ కెనాల్ అధికారులకు మరమ్మతులు చేయాలని సూచించడంతో రైతులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది, ఈ మరమ్మత్తులు కూడా రెండు మూడు రోజులలో పూర్తి చేసి బుడ్డాయిపల్లి కేసి ఉపకాలవ ద్వారా నీటిని వదలడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలపడం జరిగింది.