PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రిపబ్లిక్‌’ సాంగ్‌ రిలీజ్‌

1 min read

సినిమా డెస్క్​: యంగ్‌ హీరో సాయితేజ్‌తో దేవ కట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేష్​ హీరోయిన్‌. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. శనివారం మణిశర్మ పుట్టినరోజు కావడంతో నిన్న మూవీలోని ఫస్ట్‌ సాంగ్‌ని ప్రసాద్‌ ల్యాబ్‌లో కొరటాల శివ లాంచ్ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ‘సాంగ్ చాలా బాగుంది. స్వేచ్ఛ గురించి అంత బాగా రాయడాన్ని మెచ్చుకోవాలి. సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి. మణిశర్మ గారిని మెలోడీ బ్రహ్మా అని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమయ్యింది. నా బ్రదర్‌‌లా ఫీలయ్యే తేజకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే సంతోషపడతాను’ అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ ‘మా సినిమాని కచ్చితంగా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాం. మణిశర్మ గారితో పని చేయాలన్న ఆశ ఈ సినిమాతో తీరింది’ అని చెప్పాడు. రాజు సుందరం మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌‌గా కనిపించనున్నాడు. రమ్యకృష్ణ, జగపతిబాబు, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్స్‌లో విడుదలయ్యే చాన్స్ ఉంది.

About Author