రెగ్యులర్ ఆధార్ సెంటర్ నియమించాలనీ ఎంపీడీఓకి వినతి – ఎస్డీపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎస్ డి పి ఐ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి,N. సుబాన్ ఉపాధ్యక్షులు K. అబ్దుల్ రెహమాన్ లు మాట్లాడుతు హొళగుంద మండలంలో మొత్తం 16 పంచాయతీలలో 26 గ్రామాలు కలిగిన మండలము లో ఒకటి కూడా రెగ్యులర్ ఆధార్ సెంటర్ లేదు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కొరకు ఆదోని లేదా ఆలూరు కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అక్కడ వెళ్లిన కూడా ఒక్క రోజుల్లో పని జరగక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సచివాలయంలో రెండు మూడు నెలకొకసారి ఆధార్ కార్డు క్యాంపులు పెడుతున్న ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అంతేకాక ఆధార్ కార్డు క్యాంప్ లో 100% అర్జీలు వస్తే సచివాలయంలో 30% వరకే పరిష్కరిస్తున్నారు సమస్య నెట్వర్క్ రావడం లేదని సమస్య గా వుంది, అందువలన 100% పరిష్కారానికి హొళగుంద మండలం లో రెగ్యులర్ ఆధార్ సెంటర్ స్థానిక mpdo ఆఫీస్ లో కాని, స్థానిక మీసేవ కేంద్రాల ద్వారా కానీ ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఇంచార్జికి కీ ఎంపీపీ తనయుడు ఈసా కు,S D P I సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ తరఫున కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీ N . సుబాన్. ఉపాధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ,కార్యదర్శి ఎం హఫీజ్ ,కమిటీ సభ్యులు ఎం వాజిద్, రహమతుల్లా, అస్లాం,ఫాజిల్, బాషా, జఫరుల్లా తదితరులు పాల్గొన్నారు.