PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని తాసిల్దార్ కు వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లోని తుగ్గలి మండలం లోని మదాసికురువ/మదారికురువలు ఎస్సీలుగా నమోదు అయిన వారిని జాబితా నుండి తొలగించకుండా అలాగే కొనసాగించాలని, GO’s.03/150 ప్రకారం కురువగా  పిలవబడే వారికి మదాసికురువ మదారికురువ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం మదాసికురువ/మదారికురువ(కురువ) SC హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తుగ్గలి మండలం తాసిల్దార్ కే రమాదేవికి వినతి పత్రం అందజేశారు.  ఈ కార్యక్రమంలో నగరి నాగ భూషణం జిల్లా గౌరవాధ్యక్షులుకర్నూలు నేరడు జల్ల చంద్రశేఖర్  జిల్లా డైరెక్టర్ జిల్లా గొర్రెల/మేకల పెంపకం దారుల సహకార సంఘం యూనియన్,మంకె కురువ లక్ష్మన్న నియోజకవర్గ సీనియర్ నాయకులుపత్తికొండ.బిజ్జే లింగప్ప,ఎన్.బ్రహ్మానందం.ఎన్. చంద్రమోహన్. ఎన్ అశోక్. ఎన్. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *