దేవాలయ భూమిని కాపాడాలని తహసిల్దార్ కు వినతి..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరుసాహెబ్ పేట గ్రామంలో రెడ్డి వారి వంశస్థులు దాదాపుగా వంద సంవత్సరాల క్రితం దేవతామూర్తులైన ఈశ్వరుడు,ఆంజనేయుడు, శ్రీరామచంద్ర స్వాముల వారికి దేవాలయ అభివృద్ధి కొరకు దాదాపుగా 10 ఎకరాల 75 సెంట్ల భూమిని రెడ్డి గారి వంశస్తులైన వీరారెడ్డి శివరామిరెడ్డి,దేవాలయం పేరిట రిజిస్టర్ చేయించారు. అయితే ఆ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో రెండున్నర సంవత్సరాల కిందట మళ్లీ పునరుదించారు. ఆ ఆలయ భూములను కొందరు ఆన్ లైన్ లో నమోదు చేయించుకున్నారని తొలగించి దేవాలయం పేరిట నమోదు చేయాలని సోమవారం పీపుల్ గ్రీవెన్స్ రేడ్రల్ సిస్టంలో రెడ్డివారి వంశస్తుడైన సోమసుందర్ రెడ్డి స్థానిక తహసిల్దార్ ఏ. శ్రీనివాసులు కు మరియు ఎంపీడీవో దశరథ రామయ్యకు రెడ్డివారి సోమ సుందర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి నిన్న గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.అదే గ్రామానికి చెందిన రెడ్డివారి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆన్ లైన్ నమోదు చేసుకున్నాడు. ఆ ఆలయ భూమి గతంలో దేవాలయం పేరిట రెడ్డివారి వంశస్థులు రిజిస్ట్రేషన్ చేయించారు కావున అది పరిశీలించి ఆన్లైన్లో తొలగించాలని వారి వంశస్థులు ఫిర్యాదు చేశారు.