ఉపయోగపడే పనులు చేయాలని డిప్యూటీ కలెక్టర్ కు వినతి..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామాల్లో గ్రామ ప్రజల అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల బొల్లవరం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గ్రామ సభలకు హాజరైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి కి వినతి పత్రం అందజేస్తూ గ్రామ అభివృద్ధికి వ్యవసాయ కూలీలకు రైతులకు ఉపయోగపడే ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని అధికారులకు వ్యకాస ఆధ్వర్యంలో డీఆర్డిఏ పీడీ శ్రీధర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.పక్కిర్ సాహెబ్,డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బాబు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నల్లమల రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఒకేసారి ఉపాధి గ్రామ సభలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు, వామపక్ష పోరాటం ఫలితంగా 2004 లో ఈ చట్టం వచ్చిందన్నారు.పనులు లేని కాలంలో ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు కల్పించి పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం ఈ చట్టం లక్ష్యం అని ఉపాధి చట్టం లక్ష్యానికి భిన్నంగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెంచే పద్ధతిని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు ఉపయోగపడే మంచినీటి చెరువులు,పంట కాలువలు,రైతు పొలాల్లో గులకరాళ్లు తొలగించడం, రైతుల బీడు భూముల్లో బండరాళ్లు తీసివేయడం, హార్టికల్చర్ లో ఉన్న ఉపాధి హామీ ద్వారా 5 ఎకరాల నిబంధనలను తొలగించి పది ఎకరాల రైతులకు వర్తింపచేయాలన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్మశాన వాటికల్లో అభివృద్ధి చేయాలని రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్లు వెయ్యాలన్నారు.మట్టి పని, జంగిల్ క్లియరెన్స్ గుర్రపు డెక్క తొలగింపు పనులను ఉపాధి హామీ చట్టంలో చేర్చాలన్నారు.600 రూ.లు చేయాలని 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ బాబు, విజయుడు,జానేష్,లక్ష్మీదేవి, మార్తమ్మ పాల్గొన్నారు.