విద్యార్థులకు సకాలంలో బస్సులు తిప్పాలని ఆర్టీసీ కంట్రోల్ అధికారికి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలంలో గ్రామీణ ప్రాంతా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థులకు సకాలంలో బస్సులు తిప్పాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆర్టీసీ కంట్రోల్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర , ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి ఖాదర్ భాషా తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు బస్సులు తిప్పి సహకరించాలని, చాలా గ్రామాలకు బస్సులు లేక విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా వివిధ గ్రామాల నుండి ఆటోలలో 25 నుండి 30 మంది విద్యార్థులు చొచ్చుకునే ప్రమాదకరంగా ప్రయాణం చేసి విద్యాలయాలకు వెళ్లడం జరుగుతుందని, ప్రమాదం తెలుసు విద్య కొరకు విద్యార్థుల సాహసం చేస్తున్నారని కాబట్టి ఆర్టీసీ అధికారులు మానవ దృక్పథం తో విద్యనభ్యసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సకాలంలో బస్సులను తిప్పాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోను ముట్టడిస్తామని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వలి, విష్ణు, నరసింహులు, శివ, అర్జున్, రమేష్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.