మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీ యువతకు కేటాయించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: సిబిన్ ఆర్మీ మండల అద్యక్షుడు ముల్లా మోయిన్ఆలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవిని హోళగుంద మండల ముస్లిం మైనార్టీ యువతకు కేటాయించాలి అని ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లిం మైనారిటీ యువకులు, సిబియన్ ఆర్మీ మండల అద్యక్షుడు ముల్లా మోయిన్ డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ అనుబంధ సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ముస్లిం మైనార్టీ యువత అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల సమస్యపై, ఇసుక సమస్యలపై, ఇతరత్రా ప్రజా సమస్యలపై తమ గళం వినిపిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ కోసం ముస్లిం మైనార్టీ యువత నిలబడ్డారని అన్నారు. ముస్లిం మైనార్టీలు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఆలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీలకు కేటాయించాలనిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ , వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు , కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి , ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ కు కోరుతున్నాం.