PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎం.పి.టి.సి పదవికి రాజీనామా చేసిన కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

1 min read

–2021లో పంచలింగాల నుంచి ఎం.పి.టి.సి గా గెలుపొందిన నాగరాజు

రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ కి అందజేసిన ఎం.పి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎం.పి.టి.సి పదవి కి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు రాజీనామా చేశారు.. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ నర్సారెడ్డి కి అందజేశారు.. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి ఎం.పి.టి.సి గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన నాగరాజు. ఆ తరువాత 2024 లో కర్నూలు ఎం.పి గా టిడిపి నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి రామయ్య పై 1,11,298 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు..దీంతో ఇప్పుడు ఎం.పి గా ఉండటంతో ఎం.పి.టి.సి పదవికి నాగరాజు రాజీనామా చేశారు.

About Author