సీఎంఓ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి..
1 min readపెండింగ్ లో ఉన్న పిజిఆర్ఎస్ ఫిర్యాదులను క్లియర్ చేయండి
పిజిఆర్ఎస్ కు 178 విజ్ఞప్తులు
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించి పెండింగ్లో ఉన్న 1020 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే పరిష్కారం చూపాలన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని పదేపదే చెబుతున్నా ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటలు, 48 గంటలు, 72 గంటల లోపల పరిష్కరించే సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న 1020 ఫిర్యాదులలో 759 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయని… ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వారంలో మూడు రోజులు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పిజిఆర్ఎస్ ఫిర్యాదులతోపాటు సంబంధిత శాఖల ప్రగతిపై పర్యవేక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను సరైన రీతిలో ఎండార్స్ ఇవ్వకపోవడం వల్లే రీఓపెన్ అవుతున్నాయని సమస్యలపై కనీస దృష్టి పెట్టడం లేదని కలెక్టర్ తెలిపారు. రీ ఓపెన్ అయ్యే ఫిర్యాదుల కంటే ముందే సంబంధిత అధికారులకు మెమో వెళ్లాలని కలెక్టర్ పిజిఆర్ఎస్ అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు
1) నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ కు చెందిన ఉమాదేవి తాను కర్నూలు వెంచర్ సర్వే నంబర్ 1722 లో 2.50 సెంట్ల స్థలం వున్నదనీ స్థలం పక్కన దక్షిణం వైపు మరియు తూర్పు వైపు పంట కాలువ ప్రవహిస్తున్న నేపథ్యంలో పంట కాలువను ఆక్రమించుకున్న కొందరు నా స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని…రీ – సర్వే జరిపించి తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
2) శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామ కాపురస్తుడు చిన్న కొండలు ఐటిఐ ఉత్తీర్ణతై సున్నిపెంట ఆర్డబ్ల్యుఎస్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నానని ప్రస్తుతం విధుల నుండి తొలగించే అవకాశం వుందని ఉద్యోగం కొనసాగేలా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
3)బేతంచేర్ల మండలం సీతారామాపురం గ్రామ వాస్తవ్యుడు సురేంద్ర తన ఇంటికి ఎదురుగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నదనీ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల దుమ్ము, ధూళి వస్తుంది దాని వల్ల పిల్లలు,పెద్ద వాళ్ళు అనారోగ్యం తో బాధ పడుతున్నారని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 178 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.