PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతన్నను..కార్యాలయాల్లో గౌరవించండి

1 min read

నో రెకమెండేషన్..నాకు అందరూ సమానమే

ఐదేళ్లు గుర్తుండి పోయేలా ఉండాలన్నదే నా కోరిక

రైతులకు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అన్నం పెట్టే రైతన్నలు కార్యాలయాలకు వస్తే వారిని గౌరవించి కూర్చోబెట్టి వారి సమస్యను సాదరంగా విని మంచిగా పలకరించాలని అంతేకాకుండా అధికారులు ప్రజలకు జవాబు దారీ తనంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సూచించారు.గురువారం ఉదయం నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముందుగా మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి మాట్లాడుతూ మొక్క జొన్నలను కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనే విధంగా చూడాలని ఆయన ఎమ్మెల్యేను కోరారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ మంత్రితో మాట్లాడి రైతులకు 6 వేల క్వింటాళ్ల విత్తనాలను నియోజకవర్గానికి మంజూరు చేయించడం జరిగిందని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి రైతుకు సబ్సిడీ విత్తనాలు అంతే విధంగా చూస్తామని అన్నారు. ప్రతి మండలానికి రెండు కోట్ల 50 లక్షలు నిధులు సీసీ రోడ్లకు  మంజూరు చేయడం జరిగిందని ఎవరైనా సరే నా పేరు చెప్పి నాకు ఎక్కువగా విత్తనాల ప్యాకెట్లు కావాలని అడిగినా సరే ఎవరికి ఇవ్వవద్దు (నో రెకమెండేషన్స్) రైతులతో పాటు అందరికీ సమానమే ఇవ్వాలని ఆయన అధికారులకు తెలిపారు.ఈ ఐదేళ్లపాటు గుర్తుండి పోయేలా అభివృద్ధి చేయాలనేదే నా కోరిక.. ఇరిగేషన్ మరియు తదితరు కార్యాలయాలు నందికొట్కూరు లోనే ఉండే విధంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి 5,334 క్వింటాళ్లు శనగ విత్తనాలు వచ్చాయని ప్రతి రైతుకు ఒక బస్తా నుండి పది బస్తాల వరకు ఇస్తారని ఎమ్మెల్యే అన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మల్ల రబ్బానీ,వ్యవసాయ శాఖ ఏడిఏలు విజయ శేఖర్, ఆంజనేయులు,ఏఓ లు షేక్షావలి,కృష్ణారెడ్డి,కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి,జాకీర్ హుస్సేన్ నాయకులు పలుచాని మహేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర్లు యాదవ్,ముర్తుజావలి, లాయర్ జాకీర్ హుస్సేన్, లక్ష్మాపురం బూషి గౌడ్, ప్రాతకోట వెంకటరెడ్డి,రసూల్ ఖాన్,హరి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author