ఘనంగా జైల్ సూపరింటెండెంట్..పదవీ విరమణ
1 min readహాజరైన అధికారులు శ్రేయోభిలాషులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు సబ్ జైల్ సూపరింటెండెంట్ తెలుగు మల్లయ్య పదవీ విరమణ కార్యక్రమం నందికొట్కూరు పట్టణంలోని సేపురా ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా జరిగింది.గత 40 ఏళ్ల ఉద్యోగ విధుల్లో పని చేశారని 1985 లో జైలు వార్డర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ సబ్ జైలు సూపరింటెండెంట్ గా ఎదిగి పదవీ విరమణ పొందారని అంతేకాకుండా ఆయనకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం ఉండగానే పదవీవిరమణ చేస్తూ ఉన్నారని ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఎదగడం చాలా సంతోషించదగ్గ విషయమని ఎంతో మంది ఖైదీల్లో మార్పు తీసుకువచ్చారని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈయన స్వగ్రామం పగిడ్యాల మండలం పాత ముచ్చమర్రి గ్రామానికి చెందిన తెలుగు పకీరయ్య,రంగమ్మ ల కుమారుడు మల్లయ్య అని ఇదే ప్రాంతంలోనే పదవి విరమణ చేయడం సంతోషకరమని వారు అన్నారు.ఈయన ఉద్యోగ సమయంలో ప్రతి ఒక్కరినీ మంచిగా పలకరిస్తూ అదేవిధంగా జైలులో ఉన్న ఖైదీలకు వారంలో మంచి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఖైదీలకు అవగాహన కార్యక్రమాల ద్వారా మార్పులు తీసుకువచ్చారంటూ పలువురు వ్యక్తులు అన్నారు. మల్లయ్య,పార్వతమ్మ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి వారు సేవలను జిల్లా సబ్ జైల్ అధికారి డి నరసింహారెడ్డి,రిటైర్డ్ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి,తోటి ఉద్యోగులు శ్రేయోభిలాషులు గుర్తు చేశారు.ఆయన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో జైలర్ జనార్ధన్, నంద్యాల గురు ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ డిప్యూటీ జైలర్ సర్వంత్,కూతుర్లు షర్మిల సంధ్యారాణి హిమబిందు, ప్రవీణ్ కుమార్,విజయ కులకర్ణి,శేఖర్,బొల్లవరం పీఎస్ నూరుల్లా మరియు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు పాల్గొన్నారు.