PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి..

1 min read

ఎల్​.కె. చిన్నప్ప సేవలు మరువలేము

  • పీఠాధిపతి బిషప్​ గోరంట్ల జాన్వెస్​

ఆదోని, పల్లెవెలుగు: ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని… కానీ ఉద్యోగి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు అనంతపురం– కర్నూలు పీఠాధిపతి బిషప్​ గోరంట్ల జాన్వెస్​.  ఆదివారం సెయింట్​ ఆంథోని వారి పాఠశాల (ఆర్​ సీఎం) ప్రధానోపాధ్యాయుడు ఎల్​. కె. చిన్నప్ప పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్​ఎం ఎల్​.కె.చిన్నప్పకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పీఠాధిపతి బిషప్​ గోరంట్ల జాన్వెస్​  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్​.కె. చిన్నప్ప  నిరంతర కృషి వల్ల  పాఠశాలకు మంచి గుర్తింపు లభించిందని, ఆయన స్థానం పూరించడం సాధ్యం కాదన్నారు. రిటైర్డు అయిన తరువాత కూడా విద్యార్థులకు జీవిత పాఠాలు నేర్పాలని ఈ సందర్భంగా పీఠాధిపతి బిషప్​ గోరంట్ల జాన్వెస్​   ఆకాంక్షించారు.

About Author