రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: పదవీ విరమణ పొందిన ఉద్యోగ , ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి. ఉద్యోగల సరెండర్ లీవు బిల్లులు అనేక సంవత్సరాలుగా సి.ఎఫ్.ఏం.ఎస్.లోనే పెండింగ్ లో ఉన్నాయి.. కనీసం పోలీసు ఉద్యోగులకు అయినాసరే సరెండర్ లీవులైన దసరా పండుగకు చెల్లించండి… 👉 ఉద్యోగులు వారి కుటుంబ తక్షణ అవసరాల కోసం దాచుకున్న జీ.పీ.యఫ్ / జడ్పీ.పి.యఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలా చర్యలు తీసుకోవాలి .. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం/ పెన్షన్ ను చెల్లిస్తూ ఉద్యోగుల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కపాడుతున్నందుకు గౌ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు. బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు ఈ రోజు తేదీ 7.10.2024 సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం లోని రెవెన్యూ భవన్ నందు ఉదయం 11.30గంటలకు జరిగిన పత్రికా సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ….. రాష్ట్రంలో నేడు మెజారిటీ ఉద్యోగుల కోరుకున్న ప్రభుత్వం అధికారం లోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వం పై ఎన్నో ఆశలు ఉద్యోగులు పెట్టుకున్నారు. ఇంటి అద్దె చెల్లింపు, నెల వారి సరుకులు, పిల్లల స్కూలు ఫీజులు, మెడికల్ ఖర్చులు, లోన్లు, తదితర విషయాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందికి గురై గత ప్రభుత్వ హయంలో అప్పులకోసం చేయి చాచాల్సి వచ్చి అత్మభినాం చంపుకునే పరిస్థితి నుండి నేడు ఠంచనుగా ఒకటో తేదీన జీతం/పెన్షన్ చెల్లిస్తూ, గతంలో కోల్పోయిన గౌరవాన్ని , ఆత్మాభిమానాన్ని కాపాడిన గౌ II ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఏ.పి.జే.ఏ.సి అమరావతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 2022 నుండి పదవీ (రిటైర్) విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ .