పదవీ విరమణ సన్మాన సభ….
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డాక్టర్.L.భాస్కర్ ఆద్వర్యం లో డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ ( DPHNO ) పదవీ విరమణ సన్మాన సభ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డాక్టర్.L.భాస్కర్ మాట్లాడుతూ 1985 వ సంవత్సరము లో వైద్య ఆరోగ్య శాఖ లో ప్రభుత్వ ఉద్యోగిగా చేరి వివిధ క్యాడర్ లలో ఉత్తమ సేవలు అందించి ఈ రోజు పదవీ విరమణ పొందుతున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆమె శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రోగ్రాం అధికారులు మరియు కార్యాలయ సిబ్భంది పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమములో పరిపాలనాధికారి అరుణ , PO RBSK హేమలత , DPMO డాక్టర్ ఉమా , DIO డాక్టర్ నాగప్రసాద్ , SO హేమసుందరం , DEMO శ్రీనివాసులు , కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.