ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి
1 min readజిల్లా పంచాయతీ అధికారిని మంజులవాని..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రతి ఉద్యోగి పదవి విరమణ తప్పనిసరి అని ఉద్యోగ ప్రస్థానంలో మన పని విధానం వల్ల ఎంతమంది సంతృప్తి చెందారన్న దే ముఖ్యమని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి మంజులవాని తెలిపారు నిగర్వి సౌమ్యుడు స్నేహశీలి గడివేముల ఈఓఆర్డి అబ్దుల్ ఖాలిక్ పదవి విరమణ సందర్భంగా శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయం లో జరిగిన పదవీ విరమణ సభ కు అధికారులు నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా అబ్దుల్ ఖలిక్ ను పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి టిడిపి మండల కన్వీనర్ సత్యం రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు తాసిల్దార్ జమానుల్లా ఖాన్. ఎంపీడీవో శివరాంరెడ్డి. ఈ ఓ ఆర్ డి వెంట పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ నాగమద్దమ్మ. జడ్పిటిసి ఆర్ బీ చంద్రశేఖర్ రెడ్డి. ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి వైసిపి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.