పదవి విరమణ ఉద్యోగులకు సహజం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని టిడిపి నాయకులు మాధవరం రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు గుండ్రెవుల నిరుపమ పదవి విరమణ చేశారు. తోటి ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గురువులు ఉంటేనే పిల్లలు ఉన్నత శిఖారాలకు ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. చదువు చెప్పే గురువు తర్వాత తల్లిదండ్రులు, దేవుళ్లను ప్రార్ధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణ ఉపాధ్యాయులు తోనే వస్తుందని తెలిపారు. ఈమె విద్యార్థులకు చేసిన సేవలు మరువలేనివి అన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన నిరుపమ ను పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించారు. తర్వాత ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బోజరాజు, జిల్లా పరిషత్ ఉన్నత ఛైర్మెన్ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు లక్కి విజయ్,మాబ్బాష, హుస్సేన్ ఆలం తదితరులు ఉన్నారు.