PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేతల ముద్దుబిడ్డ డిప్యూటీ కలెక్టర్ పదవి విరమణ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు:  చేనేతల ముద్దుబిడ్డ గౌరవనీయులు డిప్యూటీ కలెక్టర్ మలవత్తు వెంకట సుధాకర్  పదవి విరమణ కార్యక్రమం లో ఈరోజు జిల్లా చేనేత నాయకులు పాల్గొని ఆయన సమాజంలో చేనేతలకు అండగా ఉండి ఎన్నో కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించినారని ఈ సందర్భంగా జిల్లా చేనేత నాయకులు ఆ మహా మనిషిని కొనియాడారు వారి యొక్క పదవి విరమణ జీవితం చేనేత సమాజం కొరకు కేటాయించి చేనేతల బతుకులు వెలుగు నింపాలని చేనేత సమాజం ఆశపడుతుంది మంచితనానికి మారుపేరైన ఆ మానవతా మూర్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుని చేనేత నాయకులు కోరినారు ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు బూదాటి రాధయ్య కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం దామయ్యగుంట గ్రామ సర్పంచ్ చిమట శేషగిరి  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి  కాసా శ్రీనివాసులు  విడవలూరు మండలం బిజెపి అధ్యక్షులు కనపర్తి నాగేంద్ర   చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు నందం అశ్వద్ధామ  జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ  అఖిలభారత పద్మశాలి సంఘం కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్  కోస్తాంధ్ర పద్మశాలి సంఘం కోవూరు నియోజకవర్గం అధ్యక్షులు సోమా గోపాల్   పాల్గొన్నారు.

About Author