చాటపర్రు గ్రామంలో రెవెన్యూ సదస్సు
1 min readరెవెన్యూ సదస్సులు వచ్చిన వినతులు స్వీకరించి సత్వర పరిష్కార దిశగా అడుగులు
జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రైతుల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. శనివారం చాటపర్రు పంచాయితీ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవిన్యూ సదస్సుకు జెసి ధాత్రిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా రెవిన్యూ సదస్సు లో వచ్చిన వినతులను ఆమె స్వీకరించి సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారురను ఆదేశించారు. అనంతరం చాటపర్రు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అలాగే రైతులకు అందించే గోనె సంచుల నాణ్యతను పరిశీలించారు. చినిగిపోయిన వాటికి బదులు కొత్త సంచులు తీసుకోవాలని జెసి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుడిపూడి రఘు, రెవిన్యూ , సివిల్ సప్లైయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.