భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దాహోద పడతాయి
1 min readఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గత ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయిల్లో నెలకొన్న భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి-మీ హక్కు కార్యక్రమం ఎంతగానో దోహదమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు సమీపంలోని శనివారపు పేట గ్రామ సచివాలయం వద్ద బుధవారం మీ భూమి – మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,, ఆ ప్రాంతానికి సంబంధించి భూపరమైన సమస్యలున్న వారినుండి వినతులు స్వీకరించారు. స్వయంగా ఆయనే ప్రత్యేకంగా సమస్యలను సైతం నమోదు చేసుకున్నారు. సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన కారణంగా గత ఐదేళ్ళలో రెవెన్యూ పరంగా అనేక సమస్యలు తిష్టవేశాయని ఆరోపించారు. అంతేకాకుండా అనేక అవకతవకలు చోటుచేసుకోవడంతో కూటమి ప్రభుత్వాధినేతలు వాటిన్నింటిపై ప్రత్యేక దృష్టిసారించి, పరిష్కారాలందించే క్రమంలో మీ భూమి – మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.ఈ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో విలీనమైన 7 గ్రామ పంచాయతీల ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం అందించే సేవల్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సత్ఫలితాలందించే దిశగా సాగుతాయని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఈ సదస్సులో డిప్యూటి కలెక్టర్ ఎం. ముక్కంటి, ఏలూరు అర్భన్ తహశీల్దార్ జీ.వి. శేషగిరి, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ గునిపూడి శ్రీనివాసరావు, కో అప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, మాజీ కార్పొరేటర్ గూడవల్లి వాసు,మాజీ ఎంపిపి అద్దంకి రాంబాబు, టిడిపి నాయకులు కడియాల విజయలక్ష్మి, లంక వెంకట రాజశేఖర్, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.