జిల్లాలో ఇంతవరకు 479 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహణ
1 min readప్రజల నుంచి 4,831 అర్జీలు స్వీకరణ
జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 254 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితెలిపారు.జిల్లాలో సోమవారం నిర్వహించిన 35 రెవిన్యూ సదస్సుల్లో 977 మంది పాల్గొని ఆయా సమస్యలపై 209 అర్జీలను అందజేయగా వాటిలో అప్పటికప్పుడే 90 అర్జీలు పరిష్కరించడం జరిగిందన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 479 గ్రామ రెవిన్యూ సదస్సులకు 19,874 మంది హాజరై 4,831 అర్జీలు అందజేయగా ఇప్పటికే 1793 అర్జీలుపరిష్కరింపబడ్డాయన్నారు. జనవరి 8వ తేదీ వరకు ఆయా గ్రామల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులలో ప్రజలు పాల్గొని తమ భూములకు సంబందించిన సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలన్నారు.