పెదవేగి మండలంలో రెవెన్యూ గ్రామ సదస్సులు
1 min readరైతులు తమ భూమి సమస్యలను అర్జీ రూపంలో తెలపాలి
ఇన్చార్జి తాసిల్దార్ భ్రమరాంబ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరుపెదవేగి మండలంవంగూరు గ్రామం లో గురువారం రెవిన్యూ గ్రామ సదస్సులు జరిగింది,ఈ సదస్సు లు గ్రామ సర్పంచ్ చీలి రూతు జోసెఫ్ అధ్యక్షతన జరి గింది, వంగూ రు గ్రామం లో రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలు తెలుపుతూ అర్జీ పెట్టాలని ఆ సమస్యలను నమోదు చేసుకుని నిర్ణీత వ్యేవది లో పరిష్కరిస్తామని పెదవేగి ఇన్ చార్జీ తహశీల్దార్భ్రమరాంబ తెలిపారు, ముఖ్యంగా వంగూరు గ్రామం లో పాస్ బుక్ లు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు తమ వివరాలు తెలియ జేయాలని అన్నారు, సాగులో ఉన్న రైతుల వివరాలు రెవిన్యూ రికార్డులలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు,కొంత మంది రైతుల వివరాలు అడంగల్ రికార్డుల్లో కూడా నమోదు కానీ వారు ఉంటే అటువంటి రైతులు అర్జీలు పెట్టు కావాలని సూచించారు,సహజం గా గ్రామాలలో పూర్వం ఒకరి సర్వే నంబరు ఇంకొకరి పాస్ బుక్ లలో ఉండేవని అటువంటివి ఏమైనా ఉన్నా రైతులు సదస్సు దృష్టికి తెచ్చిపరిష్కరించు కావాలని తహశీల్దార్ భ్రమరాంబ రైతుల కు వివరించారు,ఈ సదస్సు లో పెదవేగి మండల సర్వేయర్ మూర్తి, ఇన్చార్జి ఆర్ ఐ కే ఐ వి సారథి,గ్రామ రెవిన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.