PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు  జీజీహెచ్​ ధనవంత్రి హాల్లో హెచ్వోడీస్ లతో సమీక్ష సమావేశం

1 min read

అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఆరోగ్యశ్రీ :ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ అన్ని విభాగాలలో ఆరోగ్యశ్రీ టార్గెట్లను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం పీడియాట్రిక్ మరియు గైనిక్ విభాగాల హెచ్వైడి లను ఆరోగ్యశ్రీ టార్గెట్లను పూర్తి చేసినందుకు సంబంధించిన హెచ్వైడి లను అభినందించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని పలు విభాగాలలో  ఆరోగ్యశ్రీ  రిజెక్టు కేసులు బాగా తగ్గిపోయాయి ఈ 15 రోజులలో 8 కేసులు రిజెక్ట్ అయినాయి, అందులో రీ అప్లై చేయాలని సంబంధించిన హెచ్చోడిలకు ఆదేశించారు. ఈ హాస్పిటల్ :ఆసుపత్రిలో పలు విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ బాగా చేశారని సంబంధించిన హెచ్చోడిలను అభినందించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్ లో ల్యాబ్ మోడ్యుల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని బయో కెమిస్ట్రీ, పెథాయాలజీ, మైక్రోబయాలజీ సంబంధించిన హెచ్చోడిలకు ఆదేశించారు.ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్  ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అందులో వచ్చే ఆదాయము హెచ్ డి ఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింద ఆసుపత్రి అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు.పలు విషయాలపై సమీక్ష :ఆసుపత్రిలోని అన్ని విభాగాల లో ఉండే హౌస్ సర్జన్ లు FRS తప్పకుండా అటెండెన్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధించిన హెచ్చోడిలకు ఆదేశించారు.ఆసుపత్రిలోని హౌస్ సర్జన్స్ FRS అటెండెన్స్  రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని వారిని పరిశీలించాలని సంబంధించిన హెచ్వోడీలకు ఆదేశించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎంఈ గారి ద్వారా వచ్చిన SOP ప్రోటోకాల్ గైడ్లైన్స్  లను వాటికి సంబంధించినవి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని సంబంధించిన హెచ్వోడీలు వివరించారు వాటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు మరియు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాలని సంబంధించిన హెచ్వైడి లకు సూచించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి,  KMC వైస్ ప్రిన్సిపాల్, డా.హరిచరన్, CSRMO, డా.వెంకటేశ్వరరావు, RMO, డా.వెంకటరమణ, హెచ్వోడీస్, డా.శ్రీనివాసులు,  డా.రాధారాణి, డా.మంజుల బాయి, డా.విజయ్ ఆనందబాబు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, డా.సునీల్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.

About Author