విద్యుత్ పవర్ సప్లై పై ఏపీఎంఐడిసి ఇంజనీర్లతో సమీక్ష సమావేశం
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్డెంట్ ఛాంబర్ లోని విద్యుత్ పవర్ సప్లై పై ఏపీఎంఐడిసి మరియు APSEB ఇంజనీర్లతో మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో నిన్న రాత్రి 1.00 గంటల సమయంలోవిద్యుత్ పవర్ సప్లై లో టెక్నికల్ ప్రాబ్లం రావడం తో విషయం తెలుసుకున్న వెంటనే అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చి 2 గంటలకు వచ్చి 5 వరకు అక్కడే ఉండి విద్యుత్ పై పర్యవేక్షించి విద్యుత్ సమస్యని తత్వరగా విద్యుత్ సిబ్బందితో మరమ్మత్తులు పూర్తిస్థాయిలో క్లియర్ చేసినట్లు తెలిపారు.ఆసుపత్రిలో న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు మొదలుపెట్టారు.. త్వరలో నే అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు.ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ మ్యాన్ పవర్ షార్టేజ్ వల్ల కొందరికి కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్కి ప్రపోజల్ ని సిద్ధం చేసి పంపమని తెలిపారు.ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ వల్ల ఏదైన టెక్నికల్ ప్రాబ్లం వస్తే దానిని మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తానని వారికి తెలియజేశారుఈ కార్యక్రమానికి ఏపీఎంఐడిసి, ఈఈ శ్రీ.శివకుమార్, A PSPDCL, డి ఈ, శ్రీ.జయరాంరెడ్డి, AE, శ్రీ జాన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.