PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో  సమీక్ష సమావేశం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఛాంబర్ లోని apmsidc ఇంజనీర్లు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో, ఆసుపత్రి ఎలక్ట్రిషన్ తో కరెంటుపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో గత రెండు నెలల నుండి కరెంటుపై అధికారులతో రివ్యూ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వర్షాలు పడుతున్న కారణంగా కరెంటు సమస్యల రాకుండా ఉండడానికి  ఎలాంటి నివారణ చేయాలి అనే దానిపైన  ఏపీఎంఐడిసి అధికారులు మరియు ఎలక్ట్రికల్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు 15/05/2024 APSPDCL అధికారుల ఆసుపత్రిని సందర్శించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల ప్రకారం వర్క్స్ కంప్లీట్ చేయడం,  అందుకై క్యాంపస్ లో అడ్డుగా ఉన్న చెట్లను కొట్టించడం జరిగింది. ఆసుపత్రిలో నాలుగు ట్రాన్స్ఫార్మలను నాలుగు లక్షల ఖర్చుతో సర్వీసింగ్ చేయించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న మూడు జనరేటర్ లకు కంపెనీ ఇంజనీర్లు పిలిపించి, గత మూడు సంవత్సరాల నుండి మరమ్మత్తులు కానందు వల్ల వాటికి సర్వీస్ చేయించడానికి ఎస్టిమేషన్ తీసుకోవాలని ఏపీఎంఐసి ఇంజనీర్లను ఆదేశించారు.ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ సిబ్బందికి ప్రతిరోజు షిఫ్ట్ వారిగా   డ్యూటీ నిర్వహించేలా చూడాలని సి ఎస్ ఆర్ ఎం కి ఆదేశించారు.వర్షాలు పడుతున్న కారణంగా ఎలక్ట్రికల్ సిబ్బందికి నైట్ డ్యూటీలు ఉండేలా సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలో ఎలక్ట్రికల్ కి సంబంధించి అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్యలు వెంటనే అటెండ్ కావాలని ఎలక్ట్రికల్స్ సిబ్బంది ఆదేశించారు.ఈ కార్యక్రమానికి  CSRMO, డా.వెంకటేశ్వరరావు, ARMO మరియు ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, డా.వెంకటరమణ, APMSIDC ఇంజనీర్లు ఈఈ, శ్రీ.శివకుమార్, జేఈ శ్రీ.సెల్వం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి,తెలిపారు.

About Author