PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేడే స్పూర్తితో కార్మికుల హక్కుల కొరకు ఉద్యమించాలి – సీఐటియు 

1 min read

పల్లెవెలుగు వెబ్ దేవనకొండ:   పెట్టుబడుదారి విధానానికి, శ్రమదోపిడికి వ్యతిరేకంగా కార్మికులు పొరటాల ద్వారా మేడే ఆవిర్భవించిందని ఆ పోరాటాన్ని కొనసాగించేందుకు కార్మిక వర్గం రైతు వ్యవసాయ కార్మికులు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ సిఐటియు మండల కార్యదర్శి  అశోక్ లు పేర్కొన్నారు138 వ మేడే ను పురస్కరించుకొని దేవనకొండ మండలంలో  అరుణ పతాకాన్ని నాలుగు కేంద్రాల్లో  ఆవిష్కరించారు, తెర్నేకల్ పార్టీ కార్యాలయం దగ్గర కెపి రాముడు, తేర్నే కల్ యూనియన్ పతాకాన్ని సుధాకర్ దేవనకొండ హమాలి యూనియన్ దగ్గర నాగేష్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్న  రోజు మేడే నని 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో పెట్టుబడిదారీ విధానానికి, వెట్టీ చాకిరికి,  యాజమాన్యాల బానిసత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పనికోసం మహాత్తరా పోరాటలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ పోరాటాల ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. కేంద్రం గతంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కాడ్ లు  తీసుకొచ్చి  కార్మికులను బానిసత్వంలోకి తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నదని,  ఆదాని, అంబానీలకు అనుకూలంగా చట్టాలను తేస్తూ తమ విధానాలని ప్రవేశ పెడుతున్నారని కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ఎనిమిది గంటల పది దినాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేసే పరిస్థితి  కొనసాగుతున్నదని దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరుగుతున్న  అసంఘటిత రంగం.

About Author