ఘనంగా రియాజ్ అలీ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు
1 min readరాజకీయాల్లో ఉన్న అధిక ప్రాధాన్యత సేవా కార్యక్రమాలకే
46వ డివిజన్ కార్పొరేటర్ రియాజ్ అలీ ఖాన్
శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు, డివిజన్ ప్రజలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక బీడీ కాలనీ లో శనివారం రాత్రి 46వ డివిజన్ కార్పొరేటర్ రియాజ్ అలీ ఖాన్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులతో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం శనివారం అర్ధరాత్రి నుండే స్నేహితులు, శ్రేయోభిలాషులు, డివిజన్ ప్రజల పుట్టినరోజు వేడుకల కోలాహలం మొదలైంది.రియాజ్ అలీ ఖాన్ కు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్సిపి కార్యకర్త కొఠారి ప్రభాకర్ నాయుడు ఆయనకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రియాజ్ అలీ ఖాన్ సోదరుడు బషీర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటోనగర్ కమాన్ కట్టల మేస్త్రి షేక్ లతీఫ్, సెల్ పాయింట్ ఓనర్ రెహమాన్, ఎండి రాజా అభిమానంతో తీసుకువచ్చిన కేక్ కట్ చేసి అందరితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా రియాజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ నాపై ఇoత ప్రేమ చూపించిన మిమ్ములను నా జీవితంలో మర్చిపోలేనని. నాపై చూపించే అభిమానానికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేవుడు దయవల్ల నా పరిస్థితి బాగానే ఉందని రాజకీయాల్లో నేనున్నా. నేను ఎక్కువగా సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటూ సమయం ప్రాధాన్యత కేటాయిస్తానని అన్నారు. రాజకీయాలు దివంగత తన తల్లి ద్వారా అలవర్చుకున్నానని. రాజకీయలు, సేవా కార్యక్రమాలు నాకు రెండు కళ్ళని నేను సర్వీస్ మోటో లోనే ఉంటానని ఎవరికి ఏ బాధ ఉన్న నా వంతు సాయం నేను అందిస్తానని డబ్బు అనేది కోలమానం కాదని. ఒక మనిషికి సహాయ పడాలంటే ఏ విధంగానైనా సహాయ పడవచ్చునని ఆయన అన్నారు. ఈ రోజుల్లో మనసుతో మాట్లాడేవారు ఎంతమంది ఉన్న కుల మతాలకతీతంగా తనను అభిమానించేవారు ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నరు. మనసు విప్పి మాట్లాడే వారే మనకు ముఖ్యమని అందరూ సోదర భావంతో కలసి మెలిసి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హేలాపురి న్యూస్ చీఫ్ బ్యూరో బోడా విజయకుమార్, గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ప్రెసిడెంట్ సొంగ మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ యర్రా జయదాస్,మరియు బీడీ కాలనీ వహీద్, మున్నా, అక్బర్, ఇర్ఫాన్, హజార్, హుస్సేన్, జాకీర్, ఎర్ర శివ, సింగ్ రమేష్, గణేష్ నాయక్, సాబీర్, ఉమా మహేశ్వర రావు, నాగూర్, ఫయాజ్, రసూల్, రయాన్, కలాం, ముస్తఫా, సలీం, మురళి తదితరులు శాలువా కప్పి , పుష్పగుచ్చాలు అందించి పాల్గొన్నారు. నాకు స్వయంగా మరియు చరవాణిల ద్వారా అనేక ప్రాంతాల నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా రియాజ్ అలీ ఖాన్ కృతజ్ఞతలు తెలియజేశారు.