ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత కార్యక్రమాలు
1 min readలైసెన్సులు లేకుండా ఆటోలు నడిపితే 500 రూపాయలు జరిమానా
ప్రయాణికులను సురక్షితంగా వారి వారి ప్రదేశాలకు చేరవేయాలి
ప్రమాదాలకు గురైతే ప్రయాణికుల,ఆటో డ్రైవర్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి
జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీo
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రహదారి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా రహదారి భద్రత నియమాలను పాటించాలని తద్వారానే ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా ఉపరవాణి కమిషనర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపరమణ కమిషనర్ కరీం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రజా రవాణా విభాగంలో పనిచేస్తూఉండడం వల్ల వారు రోడ్డు ప్రమాదానికి గురైతే వారితో పాటుగా ప్రయాణికులు కూడా రోడ్డు ప్రమాదానికి గురవుత రన్నరు. ఇది ముఖ్య కారణంగా ఎప్పుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండా లన్నారు. వాహనదారులకు డ్రైవర్లకు ఆయన సూచించారు. అంతేకాకుండా తాము వినియోగించే ఆటోల భీమా ఫిట్నెస్ పత్రాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఆటోలను వాహనాలను నడపాలని తెలియజేశారు. లైసెన్సులు లేకుండా ఆటోలో నడిపినట్లయితే 5000 రూపాయల వరకు జరిమానా విధింప పడుతుందని కచ్చితంగా ఆటో డ్రైవర్లు బ్యాడ్జ్ కలిగన డ్రైవింగ్ లైసెన్స్ వినియోగించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల మంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో గత ఏడాది 25 వేల రోడ్డు ప్రమాదాలు జరగగా వాటిలో 12,000 మంది మరణించారని 27 వేల మంది గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లాలో గత ఏడాది 633 రోడ్డు ప్రమాదాలు జరగగా 254 మంది మృతి చెందారని 617 మంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు 419 రోడ్డు ప్రమాదాలు జరిగాయని వీటిలో 214 మంది మృత్యువాత పడ్డారని 440 మంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆయన తెలిపారు. కనుక ప్రతి ఒక్కరు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండి నియమ నిబంధనలకు అనుసంధానంగా మాత్రమే వాహనాలను నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదానికి గురైతే ఒక్క ఆటో డ్రైవర్ మాత్రమే ప్రమాదంలో రోడ్డును పడడని వారి కుటుంబం కూడా చిన్నాభిన్నం పడుతుందని అన్నారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా మృత్యువాత పడితే వారి కుటుంబాలు కూడా రోడ్డున పడతాయని ఆయన వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంబిఐ ఎండి విటల్, బి శేఖర్, ఎస్ జగదీష్ ,వైవిఎస్ కళ్యాణి, జి స్వామి, పి నరేంద్ర, డి ప్రజ్ఞ, డ్రైవర్లు, వాహన దారులు తదితరులు పాల్గొన్నారు.