పి ఎస్ యు విద్యార్థి సంఘం పోరాటం ఫలితంగా ఆర్టీసి బస్సు ఏర్పాటు
1 min readపి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్ …
ఈ ఉద్యమానికి సంహరించిన డిఎం గారికి మీడియా మిత్రుల కు అభినందనలు.
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు తాలూకా పరిధిలోని నందవరం మండలం గ్రామాల విద్యార్థులకు ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి ఎస్ యు) కృషి పోరాటం ఫలితంగా పూలచింత గంగవరం పెద్దకొత్తిలి చిన్నకొత్తిలి గ్రామల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు అయ్యిందని ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి పి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్ వారు మాట్లాడుతూ విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక గతంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు ఈ గ్రామాలకు బస్సు కావాలని ఉద్యమం పోరాటం చేయగా అధికారులు డిఎం,ఆర్ఎం స్పందించి బస్సును వేస్తున్నందుకు అధికారులకు మరియు ఉద్యమనికి సహకరించిన మీడియా మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ.అదేవిధంగా విద్యార్థులు ఈ ఆర్టీసీ బస్సు సౌకర్యన్ని వినియోగించుకోవాలి ఆయా గ్రామాల విద్యార్థులు సుమారు 100మంది పైగా దాక ప్రతి రోజు ఉన్నత చదువులు చదుకోవడనికి నందవరం ముగతి ఎమ్మిగనూరు స్కూల్స్,కాలేజీలకు వెళ్తూన్నారని తెలియశారు విద్యార్థులు సరైన సమయానికి వెళ్లి చక్కగా చదుకోవలని ఏమైనా విద్యార్థులు సమస్యలు వుంటే మా దృష్టికి తెలియజేయవచ్చు అని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎం అమర్నాధ్ పూలచింత యువ నాయకులు మఠం రాజశేఖర్ గారు మరియు విద్యార్థులు విష్ణు భూపాల్ పాల్గొన్నారు.