ఆర్యు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఢిల్లీ పరేడ్ కు ఎంపిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయ ఖ్యాతిని దేశరాజధాని ఢిల్లీవరకు చేర్చిన వర్సిటీ ఎన్ఎస్స్ వాలంటీర్ ఎ.కె. హర్షవర్ధన్ను వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ ప్రశంసించారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే పరేడ్కు ఎంపికైన హర్షవర్ధన్కు ఈరోజు ఆయన వర్సిటీ తరపున ట్రాక్సూటును బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత రిపబ్లిక్తే పరేడుకు ఎంపికైన తొలి విద్యార్థిగా హర్షవర్ధన్ నిలవడం వర్సిటీతోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తంచేశారు. నగరంలోని హర్షవర్ధన్ సెయింట్ జోసఫ్ డిగ్రీకాలేజి (సుంకేశుల రోడ్) కి చెందిన హర్షవర్ధన్ 30.12.2024వ తేదీన బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నాడని వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు తెలిపారు. జనవరి 26న రిపబ్లిక్తే పెరేడ్తో పాటు ఫిబ్రవరి మొదటివారంవరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో హర్షవర్ధన్ పాల్గొంటాడని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు.