శ్రీసూర్య నారాయణ స్వామి వారికి విశేషంగా అరుణపారాయణ సహిత రుద్ర అభిషేకం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భాను సప్తమి సందర్భంగా శ్రీసూర్య నారాయణ స్వామి వారికి విశేషంగా అరుణపారాయణ సహిత రుద్ర అభిషేకములు అర్చనలు జరిగినవి. భాను సప్తమి సందర్భంగా ఈరోజు తులసి మాల అలంకరణ చేయడం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించినారు.