తెలుగుదేశం పార్టీతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: తెలుగుదేశం పార్టీతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం తెదేపా నాయకులుజోరుగా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులుతెలుగుదేశం పార్టీతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పంపన్న గౌడ్, అబ్దుల్ సుబాన్,అబ్దుల్ రెహమాన్, సిబిఎన్ ఆర్మీ మొయిన్,మురళి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాలతో స్థానిక ఈ బి సి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి అని అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తెదేపా ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ కట్టుబడి ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా యువనాయకులు ముజీబ్,అల్తాఫ్,శాలి మోయిన్, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు.