గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి
1 min readఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో 2025 -26 సంవత్సరానికి గాను గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ సభా భవనం నందు 2025-26 వ ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ కొరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమం నందు ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఈవోపీఆర్డి సురేష్ బాబు లు మాట్లాడుతూ, గ్రామ ప్రణాళిక అనేది గ్రామ అభివృద్ధి కొరకు ఎంతో దోహదపడుతుందని ముందస్తుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సహాయ సహకారాలతో మంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని అలాగే నిబంధనల ప్రకారం మనకు వచ్చే ఆదాయ వనరులకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని వారు తెలిపారు. సర్పంచులు, కార్యదర్శిలు, ఆయా గ్రామాలలోని ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో కలసి సమిష్టిగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని గ్రామాలలో పర్యటించి అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి వాటన్నిటిని పరిశీలించి పక్కాగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని వారు తెలిపారు, అదేవిధంగా ట్రైనర్లు గురువేశ్వరరావు , శివకుమార్లు మాట్లాడుతూ, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల లెవెల్ అధికారులు, గ్రామ సమాఖ్య వివో లు అందరూ కలిసి గ్రామపంచాయతీలలోని సమస్యలను గుర్తించి వాటిని అధికమించేందుకు నాకు విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అలాగే అందరికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయుట గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు గారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేది గ్రామ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకుని అందరి సహకారంతో అత్యుత్తమ ప్రణాళికను తయారు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లుపాల్గొన్నారు.