ఆర్ డబ్ల్యు ఎస్ టెక్నికల్ ఆఫీసర్ అయ్యంకి శ్రీనివాసరావు పదవి విరమణ
1 min readఅసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన మహోత్సవం
పాల్గొన్న పలువురు అధికారులు, కాంట్రాక్టర్లు, కార్యాలయం సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ & ఏస్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ అయ్యంకి శ్రీనివాసరావు శనివారం పదవి వివరణ చేశారు. కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏలూరు డివిజన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత 42 సంవత్సరాలుగా గ్రామీణ నేటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో అంచలంచలుగా విశిష్ట సేవలు అందించారు. ఈయన కృష్ణాజిల్లా నుండి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి. ఇంతితై వటుడంతై అన్న చందగా అంచలంచెలుగా ఎదుగుతూ అంకితభావంతో విధి నిర్వహణలో ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ, తోటి ఉద్యోగస్తుల ఆదరభిమానాలు చురగొంటూ మచ్చలేని మంచి అధికారిగా నేడు పదవి విరమణ పొందటం అభినందనీయమన్నారు. చిన్ననాటి ప్రాథమిక విద్యాభ్యాసం లో తండ్రిని కోల్పోయిన తన కన్న కలలను ఆశయాలను సాధించుకోవడంలో అన్న వదిన, అక్క బావ లా అడుగుజాడల్లో శ్రీనివాసరావు క్రమశిక్షణ, నిబద్ధత విధేయతతో ప్రభుత్వ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం ఆ దైవ సంకల్పమే అన్నారు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం నుండి ఆధ్యాత్మిక దైవ సన్నిధిలో గడుపుతూ నేటికీ కొనసాగుతూ పదిమందికి సహాయకారిగా నిలిచారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో మేం ఇరువురం ఒకే సబ్ డివిజన్లో కలిసి పనిచేశామని ఆయన పనితనం ఫైలింగ్ సబ్మిటింగ్ విధానం, మరెవరు చేయని విధంగా ఉన్నతాధికారులకు అందించటం ఆయనకే సాధ్యమని కొనియాడారు. పదవి విరమణ ప్రతి ఒక్క ఉద్యోగికి అనివార్యమని రాబోయే రోజుల్లో ఆయన కోరుకున్న విధంగా కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యంగా ఆధ్యాత్మికంగా, ప్రశాంత గా జీవితాన్ని గడపాలని కోరారు. కార్యక్రమాo లో డి ఈ సిహెచ్ రమేష్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాథ్ బాబు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ & ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వర్మ, మరియు శ్రీధర్ బాబు డివిజన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా వారు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.