మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ని ఆవిష్కరించిన శామ్కో మ్యూచువల్ ఫండ్
1 min readఎన్ఎఫ్‌వో 04-12-2024న ప్రారంభమై 18-12-2024న ముగుస్తుంది
ఇది ఈక్విటీ, గోల్డ్ మరియు డెట్/ఆర్బిట్రేజ్ సాధనాలవ్యాప్తంగా సత్వరం మారగలిగే సామర్థ్యం గల విశిష్టమైన ఫండ్
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కొత్త ఫండ్ ఆఫర్ (NFO) అయిన మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌ను (MAAF) ప్రకటించింది. ఇది 2024 డిసెంబర్ 4న ప్రారంభమై 2024 డిసెంబర్ 18న ముగుస్తుంది. మెరుగైన రాబడులు అందించడానికి మరియు రిస్కులను తగ్గించడానికి ఈక్విటీలు, గోల్డ్ మరియు డెట్/ఆర్బిట్రేజ్ మధ్య ఈ ఫండ్ వ్యూహాత్మకంగా కేటాయింపులను సవరిస్తుంది. ఈ స్కీమ్‌లో కనీస దరఖాస్తు మొత్తం రూ. 5,000గా ఉంటుంది. సంస్థ యొక్క స్వంత R.O.T.A.T.E. వ్యూహంపై ఆధారితమైన ఈ ఫండ్, ఈక్విటీలు బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రధానంగా ఈక్విటీ మోడ్‌లోకి మారుతుంది. అలాగే, ఈక్విటీలు నెమ్మదించి బంగారం పెరుగుతున్నప్పుడు గోల్డ్ మోడ్‌లోకి మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఈక్విటీలు, గోల్డ్ రెండూ తగ్గుతున్నప్పుడు డెట్/ఆర్బిట్రేజ్ మోడ్‌లోకి మారుతుంది. తద్వారా స్థిరమైన రాబడిని అందించడానికి, మదుపరుల సంపదను సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. అసెట్ కేటాయింపుల విషయంలో ఈ ఫండ్ అసమానమైన వెసులుబాటును అందిస్తుంది. ఇది ఈక్విటీలకు 20-80%, రుణ సాధనాలకు 10-70% మరియు బంగారం, వెండి ఈటీఎఫ్‌లకు 10-70% మధ్య కేటాయిస్తుంది. తద్వారా పెట్టుబడులకు సంబంధించి ఒక సిసలైన డైనమిక్ విధానాన్ని అందిస్తుంది. ఇది కమోడిటీ డెరివేటివ్స్‌లో 30% వరకు, రీట్స్ (REITs) మరియు ఇన్విట్స్‌లో (INVITs) 10% వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సాంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ తరచుగా పరిశ్రమలో ప్రామాణికంగా పాటించే నిష్పత్తిలో గోల్డ్, ఇతర కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సాధారణంగా ఇది 10 శాతం నుండి 20 శాతం వరకు ఉంటుంది. కానీ, పటిష్టమైన అప్‌ట్రెండ్ ఉన్నప్పుడు పసిడికి 70% వరకు కేటాయింపులు జరిపే విధంగా శామ్‌కో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఉంటుంది. “డైనమిక్ ఇన్వెస్టింగ్ శక్తిని శామ్‌కో విశ్వసిస్తుంది సాంప్రదాయ స్థిర కేటాయింపుల వ్యూహాలకు భిన్నంగా రియల్-టైమ్ మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు ఉండేలా రూపొందించిన, విశిష్టమైన R.O.T.A.T.E. వ్యూహం ఆధారంగా మా ఫండ్ పని చేస్తుంది. మార్కెట్ పోకడలు మరియు ఒడిదుడుకులను బట్టి వివిధ అసెట్లకు కేటాయింపులు జరపడం ద్వారా స్థిరమైన పనితీరు కనపర్చేందుకు మేము కృషి చేస్తాం. మార్కెట్లు మందగించినప్పుడు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, అప్‌ట్రెండ్స్‌లో అధిక రాబడుల అవకాశాలను గరిష్టంగా అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. నేడు మార్కెట్లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో చురుగ్గా వ్యవహరించడం చాలా ముఖ్యం” అని శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విరాజ్ గాంధీ చెప్పారు. శ్రీమతి నిరాలీ భన్సాలీ, శ్రీ ఉమేష్ కుమార్ మెహతా మరియు శ్రీ ధవళ్ ఘన్‌శ్యామ్ ధనానీతో సహా అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ ఫండ్‌ను సంయుక్తంగా నిర్వహిస్తుంది. వారందరి అనుభవం మరియు వ్యూహాత్మక విధానమనేది ఫండ్ యొక్క వినూత్నమైన R.O.T.A.T.E. విధానాన్ని అమలు చేయడంలో కీలకంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో చురుగ్గా వ్యవహరించేందుకు తోడ్పడతాయి. “స్థూల ఆర్థిక మార్పులు, అలాగే ఎప్పటికప్పుడు మారిపోయే సెంటిమెంట్లు, మార్కెట్ సైకిల్స్‌ను నడిపిస్తుంటాయి. రిస్కులను తగ్గించి, అవకాశాలను అందిపుచ్చుకునేలా చురుగ్గా వ్యవహరించడం ద్వారా శామ్‌కో MAAF పెట్టుబడుల నిధుల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేస్తుంది. తద్వారా సంపద సృష్టి మరింత సజావుగా సాగేలా చూస్తుంది. మార్కెట్లు గరిష్ట, కనిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు భావోద్వేగాలపరంగా క్రమశిక్షణతో ఉండటం కష్టసాధ్యంగా ఉండే ఇన్వెస్టర్లకు ఈ వ్యూహం ఎంతో ప్రయోజనకరంగా ఉండగలదు” అని శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO) శ్రీ ఉమేష్ కుమార్ మెహతా తెలిపారు. ఈ ఫండ్ 65% నిఫ్టీ 50 TRI, 20% క్రిసిల్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ ఇండెక్స్, 10% దేశీయ బంగారం ధర మరియు 5% దేశీయ వెండి ధరతో కూడిన బెంచ్‌మార్క్ సూచీని ట్రాక్ చేస్తుంది.