అనాది నుంచి ఏ ధర్మం ఆచరణలోకి వస్తుందో అదే సనాతన ధర్మం
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
రాంపురంలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సృష్టి ఆరంభం నుండి ఏ ధర్మం ఆచరణలోకి వస్తుందో అదే సనాతన ధర్మమని, సమాజాన్ని అంతటినీ కలిపి ఉంచేదే ధర్మమని మన మహర్షులు ఆచరించి మనకు అందించిన ఈ ధర్మమే శ్రేష్ఠమైన దర్మమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. ప్యాపిలి మండలం, రాంపురం గ్రామంలోని శ్రీ రామాలయం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు సనాతన ధర్మాన్ని గురించి వివరించారు.గత నాలుగు రోజుల పాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డాక్టర్ దేవి దయానంద్ సింగ్ చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. గోపూజ మరియు కుంకుమార్చనలు అర్చకులు లింగేశ్వర, కంచి రాంప్రతాప్ భక్తులందరీతో చేయించారు. ఈకార్యక్రమంలో మాజీ ఉప మండలాద్యక్షులు సుంకర నాగేశ్వరరావు, ఎస్.నాగిరెడ్డి, కృష్ణమూర్తి, ఆదినారాయణ, మనోహర్, నరేశ్, ఓబుల రెడ్డి , శ్రీనివాసులు, రంగన్న రమేశ్, జయరంగయ్య, నాగభూషణంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుండి కూడా పాల్గొన్నారు. భక్తులందరికీ మహా ప్రసాదం ఏర్పాటు చేశారు.