ఆత్మ విజ్ఞాన మార్గమే సనాతన ధర్మం
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చి, జీవన్ముక్తులను చేసేది ఆత్మ విజ్ఞాన మార్గమని, అటువంటి ఆత్మ విజ్ఞాన మార్గాన్ని అందరూ అందుకున్నపుడే ప్రపంచం స్వర్గంలా తులతూగు తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బనగానపల్లె మండలం, యనకండ్ల గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు మంగళవారం ప్రారంభమైన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముద్దవరం చిన్న గోవిందు, ఉప సర్పంచ్ బొబ్బల గోపాల్ రెడ్డి, పెద్ద పుల్లారెడ్డి గారి మహేశ్వర రెడ్డి, సత్సంగ ప్రముఖ్ వడ్డే చిన్నశివన్న, అర్చకులు సానం బాల సుబ్బయ్య, పెండెకంటి శివరాముడు, సానం బాల తిమ్మయ్య, దాట్ల శ్రీరాములు, మంటి వీరయ్య, ఈడిగ కృష్ణయ్య గౌడ్, పైరెడ్డి నాగేశ్వర రెడ్డి, గంగినేని శేషన్న, దాట్ల జానకి రాముడు, బాణాల రామసుబ్బయ్య , మంటి వెంకటేశ్వర్లు, కామినేని రాములమ్మ, రేగటి రమణమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.