PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సనాతనం విశ్వశ్రేయోదాయకం… డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

1 min read

ల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సనాతనమంటే ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనదని శాశ్వతత్వాన్ని కలిగిఉన్న సనాతన ధర్మం విశ్వశ్రేయస్సును కోరుకుంటుందని, అందుకే ఈ ధర్మాన్ని విశ్వశించేవారంతా ప్రతిరోజూ తాను నమ్ముకున్న దైవం ముందు అందరూ సుఖంగా ఉండాలని, రోగరహితులై ఆరోగ్యంగా ఉండాలని, అందురూ మంచినే చూడాలని, ఎవ్వరూ దుఃఖం పొంద కూడదనే ఏకైక లక్ష్యంతో యజ్ఞాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, కొణిదేల గ్రామంలోని శివాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. ఈ కార్యక్రమంలో  ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం స్వామి, సర్పంచ్ నవీన్, భక్త కమిటి చిట్టెన్న, మిద్దె బాలిశ్వరుడు, డి రాజు, బండి మద్దిలేటి, మధుసూదన్, శ్రీను, టి వెంకటేశ్వర్లు, చిన్న రాముడు, రామలింగేశ్వరుడు, నారాయణ, రుక్మిణమ్మ, లక్ష్మన్న, లక్ష్మీదేవి, బత్తుల ఎల్లమ్మ, సరోజమ్మ, మల్లమ్మ, జ్యోతి, ధర్మ ప్రచారకులు చదుర్ల వెంకటరమణ, చెంచు రామ్మోహన్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author